Papaya Fruit : బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. మనలో చాలామంది బొప్పాయి పండును తింటుంటారు. బొప్పాయి పండుతో ఎన్నీ ప్రయోజనాలు ఉన్నాయో. వాటి ఆకులతో కూడా అంతే ప్రయోజనం ఉంది. బొప్పాయి ఆకులతో చేసిన రసం డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు, ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రసం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్ల శాతం పెరిగి ,అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
అయితే ఈ బొప్పాయి పండును మహిళల తోపాటు పురుషులు కూడా తీసుకోవచ్చా, పురుషులు తీసుకోవడం వల్ల ఏదైనా సమస్యలు తలెత్తుతాయా, అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది పురుషులు బొప్పాయి పండును ఇష్టంగా తింటుంటారు. అయితే బొప్పాయి పండును అధికంగా పురుషులు తినడం వల్ల కిడ్నీలలో స్టోన్స్ ప్రాబ్లం రావచ్చును అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే ఈ పండ్ల లో ఉండే ఫైబర్ అతిసారానికి కారణం అవుతుందట. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య కూడా పురుషులలో వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా మధుమేహం ఉన్నవారూ బొప్పాయి తినడం చాలా ప్రమాదం. కాబట్టి పురుషులలో మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తినకపోవడమే లాభదాయకం అని వైద్యులు తెలుపుతున్నారు.
ఆరోగ్యానికి మేలు చేసే ఏ పండ్లు అయినా సరే అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏ పండును ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకొని తింటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది.