Perfect Health : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన జీవన మనుగడ అంతా సంతోషంగా సాగుతుంది. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒకప్పటితో పోల్చుకుంటే ఈ రోజుల్లో మనుషులకు అనారోగ్య సమస్యలు అధికం. రోజురోజుకి కొత్త కొత్త వైరస్ లు, కొత్త కొత్త వ్యాధులతో మనుషులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానిలో మనం తీసుకునే ఆహారం కూడా ఒక భాగం.
ఈ రోజుల్లో రసాయనాలతో పండించే ఆహార పదార్థాలే ఎక్కువ. మన పూర్వీకులను చూసుకున్నట్లయితే వారు రసాయనాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునేవారు. కాబట్టి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు జీవించగలిగారు. కానీ ఇప్పటి జీవనశైలిలో వాతావరణ కాలుష్యం, రసాయన ఆహార పదార్థాలతో మన ఆరోగ్యం చాలావరకు నష్టాన్ని చవిచూస్తుంది. ఈ రోజుల్లో కూడా మరి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి తెలుసుకుందాం..
విటమిన్ సి అనేది మానసక స్థితిని మెరుగుపరచడంతో పాటు శరీరానికి ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది.ముఖ్యంగా మన మెదడులో ఉండే నాడీసమాచార వాహికల ఉత్పత్తికి ఈ విటమిన్ సీ అనేది చాలా అవసరం.మనకి డోపమైన్ అనే నాడీసమాచార వాహకం ఆనందం ఇంకా ఉత్సాహాన్ని అందిస్తుంది. దీన్ని ‘సంతోష’ రసాయనం అని అంటారు. అయితే విటమిన్ సి శరీరానికి సరిగ్గా అందకపోతే డోపమైన్ మోతాదులు ఈజీగా పడిపోతాయి.
ఇంకా అలాగే డోపమైన్‌ను నార్‌ఎపినెఫ్రిన్ అనే మరో నాడీ సమాచార వాహకంగా మార్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే నార్‌ఎపినెఫ్రిన్ మోతాదులు కనుక పడిపోతే నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటివి వస్తాయి. డోపమైన్, నార్‌ఎపినెఫ్రిన్‌లు మెదడులో వాపు ప్రక్రియ తలెత్తకుండా చాలా సహాయపడతాయి. అందుకోసమే ఆరోగ్య నిపుణులు దీన్ని నిలువరించటంపై దృష్టి పెడుతున్నారు.
మీకు ఆందోళన, నిరాశ, ఒత్తిడి కలుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే విటమిన్ సీ పదర్థాలు తినడం చాలా అవసరం. ముఖ్యంగా ఇది ఆరంజ్,బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి వున్న ఈ పండ్లు రోజు తినండి. ఎలాంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.