Platelets : డెంగ్యూ చాలా ప్రమాదకరమైనది. ఒక్కొక్కసారి దీనివల్ల ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవిస్తుంది. డెంగ్యూ బారిన పడితే ముఖ్యంగా ప్లేట్ లెట్ పడిపోతూ ఉంటాయి. ప్లేట్ లెట్ పరిరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ వైరస్ వల్ల శరీరంలోని ఇతర అవయవాలు తీవ్రంగా నష్టపోతాయి. దానివల్ల ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోతుంది. ఇప్పటివరకు కూడా డెంగ్యూకు సరైన ఔషధాన్ని కనిపెట్టలేకపోయారు.
కాబట్టి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్ లెట్స్ శాతం పడిపోకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఆహారం పదార్థాలు తీసుకుంటే ప్లేట్ లెట్ సమృద్ధిగా ఉంటాయో తెలుసుకుందాం.
బొప్పాయి ఆకులు : బొప్పాయి ఆకుల రసాన్ని నీటిలో మరిగించి రెండు లేదా మూడు రోజులు తాగడం వల్ల శరీరంలో ప్లేట్లెట్ శాతం పెరుగుతుంది. ఈ ఆకులలో ఉండే కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్లు, అసిటోజెనిన్ అనే ఫైటోకెమికల్ లు, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి శరీరంలో ప్లేట్ లెట్ శాతాన్ని పెంచుతాయి.
గోధుమ గడ్డి : గోధుమ గడ్డి ఆకుల రసాన్ని తాగడం వల్ల కూడా శరీరంలో ప్లేట్ లెట్ శాతం పెరుగుతుందని ఒక పరిశోధనలో వెళ్లడైంది. డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు గోధుమ గడ్డి రసంలో ఒక నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
కివి : కివీలో ఉండే విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ ల వల్ల డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ శాతం తగ్గకుండా చూసుకుంటుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు ఈ కివి పండు తినడం వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుంది.
దానిమ్మ : డెంగ్యూతో ప్లేట్ లెట్ శాతం పడిపోయిన వారు రోజు దానిమ్మ పండు తినడం వల్ల అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. శరీరంలో ఎర్రరక్త కణాలను పెంచడంలో దానిమ్మ చక్కగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని తిరిగి పుంజుకునేలా చేస్తుంది.
బీట్రూట్ : రక్తహీనతను తగ్గించడంలో, హిమోగ్లోబిన్ ను పెంచడంలో బీట్ రూట్ చక్కగా పనిచేస్తుంది. రోజుకు రెండుసార్లు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్ లెట్ ల శాతం పెరుగుతుంది.