Principles of Health : మన కంటే ముందు తరాల వాళ్ళకి..అంటే మన తాతలు, ముత్తాతలుకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అంటే చద్ది అన్నమే..వాళ్ళు ఆ రోజుల్లో తీసుకునే ఆహారం వాళ్ళకి ఎటువంటి రోగాలను దరిచేరనివ్వక పోయేవి. వాళ్ళు ఎంత శ్రమతో కూడుకున్న పనిని అయినా సులభంగా చేసేవారు..ప్రతి రోజు చెమటోడ్చి కష్ట పడేవారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు.
ఆ రోజుల్లో పెద్దలు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం లేవగానే చద్దన్నం లాగా తిని పొలం పనులకు వెళ్లేవారు. అలా తిన్నవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా, నీరసం అనే మాట లేకుండా తమ పనులను రోజంతా హుషారుగా చేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో జంక్ ఫుడ్ కి వివిధ రకాల బ్రేక్ఫాస్ట్ కి చాలా మంది అలవాటు అయిపోయారు. మరీ అలాంటి చద్ది అన్నాన్ని ఉదయం లేవగానే తినడం వల్ల ఏలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చద్ది అన్నంలో మనిషి శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. రోజు ఉదయాన్నే చద్ది అన్నం తింటే కడుపు సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. చద్ది అన్నం తినడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది. శరీరంలో అధిక వేడితో బాధ పడేవారు చద్ది అన్నం తింటే వేడి తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ చద్ది అన్నం వల్ల అలర్జీ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
చద్ది అన్నంలో ఉండే పీచుపదార్థాలు మలబద్దకం సమస్యను అదుపులో ఉంచుతాయి.చద్ది అన్నం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చద్ది అన్నంలోని నీళ్లను తాగడం వల్ల కడుపులోని క్రిములు నశించిపోయి, పొట్ట పరిశుభ్రంగా అవుతుంది. చద్ది అన్నం తినడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది.. శరీరం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.