Proteins : మానవుని శరీరానికి ప్రోటీన్ అవసరం ఎంతో ముఖ్యం. ఇది మానవ శరీర కండరాలా నిర్మాణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించడమే కాక, ఎముకల దృఢత్వాన్ని పెంపొందించడంలో, అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె, మెదడు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోటీన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రోటీన్ ఒక మనిషి శరీరానికి ఎంత అవసరమో ఎవరికీ సరైన అవగాహన ఉండదు. ఎందుకంటే ఆరోగ్యం, వయసు, శారీరక శ్రమ, వ్యాయామం ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. ఒక్కొక్కరి బరువును బట్టి వారి శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో అంచనా వేయాల్సి ఉంటుంది. మనం తినే ఆహారంలో ఖచ్చితంగా పావు వంతు ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు.
అంటే మన శరీర బరువుకు తగినట్టుగా కిలోకు 0.8-1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ అందితే సరిపోతుందని వారు వివరిస్తున్నారు. అలాగే ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ కూడా ధ్రువీకరించింది. ప్రోటీన్ మనకు ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రోటీన్ చేపలు, పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, సోయా, మాంసం వంటి ఉత్పత్తిలో మనకు పుష్కలంగా దొరుకుతాయి.
సంపన్న దేశాలకు చెందినటువంటి యువత ఇలాంటి ఆహారం నుంచే ప్రోటీన్ పొందుతూ ఉంటారు. అలాగే ఆహారం ద్వారా లభించని ప్రోటీన్ ల లోపాన్ని తీర్చుకోవడానికి ప్రోటీన్ సప్లిమెంట్లను వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ ప్రోటీన్ సప్లిమెంట్ల పౌడర్లను తయారు చేయడానికి మూల వస్తువుల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా బంగాళాదుంప, బియ్యం, బఠానీలతో పాటు సోయాబీన్స్ కూడా ఈ ప్రోటీన్ లనుంచి సప్లిమెంటరీ పౌడర్లను తయారు చేస్తారు.
అయితే వీటి ద్వారా దుష్ప్రభావాలు ఉన్నాయా ప్రయోజనాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం.. మీ శరీర బరువు 50 కిలోలు అయితే మీ శరీరానికి 50 గ్రాములు ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్ జీర్ణం అయ్యాక ఉత్పత్తి అయిన అదనపు అమ్మోనియాను శరీరం యూరియాగా మార్చేస్తుందని, యూరిన్ రూపంలో ఇది బయటకు వెళ్లిపోతుందని వైద్య నిపుణులు వివరించారు.