Reduce Cholesterol : ఈ రోజుల్లో అందరినీ ప్రధానంగా వేధిస్తున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. గుండెపోటు రావడానికి శరీరంలో అధిక మోతాదులో చెడు కొవ్వు పేరుకుపోవడమే ముఖ్య కారణం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటుతో పాటు, అధిక రక్తపోటు, యూరిక్ యాసిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువే.
కాబట్టి ఈ సమస్యలన్నీ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. గుండెపోటు తగ్గాలంటే క్యారెట్ జ్యూస్ మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుందని వారు తెలుపుతున్నారు. క్యారెట్ లో ఉండే ఫైబర్ కొవ్వును కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఈ జ్యూస్ గుండెపోటునే కాకుండా అధిక రక్తపోటునీ కూడా అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే ఈ రసాన్ని నెలరోజులు తాగితే అద్భుత ఫలితాలను చూడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా మన శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణం పరిమితిలో ఉండాలంటే వ్యాయామాలు కూడా చేయవలసి ఉంటుంది. ప్రతి ఉదయం వాకింగ్ తో పాటు 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరం అవుతాయి.
గుండెపోటు నుంచి ఇతర వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే కొన్ని నియమాలను మనం పాటించవలసి ఉంటుంది. మనకు దొరికే అతి సులువైన క్యారెట్ జ్యూస్ ను తాగి ఈ సమస్యలను తప్పించుకోవచ్చు. వాకింగ్ చేయడం అశ్రద్ధ చేయకుండా వ్యాయామానికి తగు సమయాన్ని కేటాయిస్తే ఇటువంటి ప్రమాదమాకరమైన వ్యాధుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. ఆలస్యం చేయకుండా వెంటనే వీటిని ఫాలో అయిపోండి.