Smartphone Use by Kids : ఆనంద్ మహేంద్ర ఎప్పుడు మంచి వ్యాఖ్యలు చేస్తూ, తన ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉంటారు. మొబైల్ వాడకం వల్ల కలిగే నష్టాలను వీడియో కార్టూన్లతో సహా తన ఫాలోవర్స్ కీ వివరిస్తుంటారు. మహేంద్ర సోమవారం రోజు ట్విట్టర్లో ఆయన ఆంధ్రప్రదేశ్ లోని సెపియన్ ల్యాబ్స్, క్రియా యూనివర్సిటీ చేసిన సర్వే గురించి అందరితో పంచుకున్నారు.
సేపీయన్ ల్యాబ్స్, క్రియా యూనివర్సిటీ చేసిన సర్వేలో చిన్న వయసులో పిల్లలు ఫోన్ వాడకం మొదలుపెడితే, దాని ప్రభావం వాళ్ళు పెద్దయ్యాక మానసిక ఆరోగ్యం పై పడుతుంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న 27,969 మంది మీద వాళ్ళు ఏ వయసులో స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ వాడకం మొదలు పెట్టారని విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య సర్వే చేశారు.
ప్రస్తుతం వాళ్ల మానసిక ఆరోగ్యంతో, గతంలో వాడిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రభావాన్ని పోల్చితే ,పెద్దయ్యాక దాని ప్రభావం ఎలా ఉంది. అనే విషయం గురించి పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే కొంచెం పెద్ద వయసు నుంచి మొబైల్ వాడకం మొదలెట్టిన యువతలో మానసిక ఆరోగ్యం బాగుందని ఆ సర్వేలో తేలింది.
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, కోపం, విసుగు,వాస్తవికతకు దూరంగా ఉండేతత్వం వంటి లక్షణాలు వీళ్లలో తక్కువగా ఉన్నాయట. చిన్న వయసు నుంచే సొంత ఫోన్ వాడిన వాళ్ల మానసిక ఆరోగ్యం, పదేళ్ల వయసు కన్నా ముందే ఫోన్ వాడినవాళ్ల మానసిక ఆరోగ్యం బాలేదని సర్వేలో తేలింది. ఈ ప్రభావం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల మీద ఎక్కువగా ఉంది.
మనిషి మనుగడలో టెక్నాలజీ అవసరం కానీ, టెక్నాలజీ పెరుగుదల భవిష్యత్తు తరాల మానసిక ఆరోగ్యం మీద ఎక్కువగా పడకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం కూడా ముఖ్యం.