Sprouted Coconut : ఆలయాల్లో లేక ఇంట్లో మనం కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో పువ్వు లాంటి తెల్లని ఆకృతిలో ఒక మెత్తటి పదార్థం వస్తూ ఉంటుంది దాన్ని అందరూ శుభసూచకంగా పరిగణిస్తూ ఉంటారు. కొబ్బరికాయలు పువ్వు లాగా వచ్చే ఆ పదార్థాన్ని తినడం ఆరోగ్యానికి మంచిదేనా దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి.
నిపుణుల సలహా ఏమిటంటే కొబ్బరికాయలో పువ్వు వస్తే దాన్ని పడేయకుండా తినాలి అని చెప్తున్నారు దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వారు సలహా ఇస్తున్నారు. కొబ్బరిపువ్వు మొలక నుండి వస్తుంది. అయితే ఇది కొబ్బరి నీటిని గ్రహించి, ఘనమైన స్పాంజ్ లాంటి ద్రవ్యరాశిగా ఏర్పడుతుంది. దీనిని కొబ్బరి పువ్వు, కొబ్బరి పిండం, కొబ్బరి యాపిల్ అంటూ చాలా రకాల పేర్లతో పిలుస్తారు.
కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ఉండే ఔషధ గుణాలు, యాంటీమైక్రోబయల్, యాంటీ పెరాసిటిక్ యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, లక్షణాలను ప్రదర్శిస్తూ తద్వారా మన శరీరంలో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను, వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధకతను మనలో పెంచుతుంది.
కొబ్బరి పువ్వు వల్ల సమృద్ధిగా పోషకాలు అందుతాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి పూర్తిగా లభిస్తాయి. కొబ్బరి పువ్వులో క్యాలరీలు తక్కువ మోతాదు ఉండడం వల్ల మన బరువును అదుపులో ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. జీవ క్రియను ప్రేరేపించి కొవ్వు కరాగడానికి సహాయం చేస్తుంది.
దీనివల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. కొబ్బరి పువ్వు వల్ల రక్తంలోని చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటూ, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరడమే కాక చక్కర వ్యాధి నుండి మనల్ని రక్షిస్తుంది. కొబ్బరి పువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణ వ్యాధులను రాకుండా నియంత్రిస్తుంది.
క్యాన్సర్ వంటి వ్యాధులు కొబ్బరిపువ్వు తినడం వల్ల మన దరిచేరవు. అలాగే వృద్ధాప్యం నుండి మనల్ని దూరం చేస్తుంది. చర్మం పైనా చారలు, ముడతలు లేకుండా చర్మం నిగారింపుగా ఉండడానికి సహాయం చేస్తుంది. కొబ్బరిపువ్వు ఒక ఎనర్జీ బూస్టర్. ఇది కనిపిస్తే తినకుండా మాత్రం వదిలిపెట్టకండి.