Sugar : మన రోజువారి జీవన విధానంలో పంచదార అధిక మోతాదులో మన శరీరంలోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా టీ కాఫీల ద్వారా పంచదార మనకు తెలియకుండానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మరి అలాంటి పంచదారను నెలరోజులపాటు తినకుండా ఆపేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా…
టైప్ టు డయాబెటిస్ : డయాబెటిస్ తో బాధపడేవారు పంచదార ప్లేస్ లో బెల్లాన్ని తీసుకుంటూ ఉంటారు. బెల్లం కూడా పంచదారతో సమానమే కాబట్టి ఒక నెల రోజుల పాటు షుగర్ పేషెంట్లు చక్కెరను తినకుండా ఉంటే డయాబెటిస్ నుండి రక్షణ పొందవచ్చు. అలాగే బెల్లానికి బదులుగా వీరు తాటి బెల్లం,తేనె వాడితే మంచిది.
గుండె సమస్యలు : అధిక పంచదార గుండె సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో రక్తం పై ఒత్తిడి పెరగడమే కాకుండా సంకోచ, వ్యాకోచాలను వేగవంతం చేయడంలో చక్కెర ప్రధాన పాత్ర పోషిస్తూ గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. కాబట్టి చక్కెరను ఎంత దూరం ఉంచితే అంత మంచిది.
మొటిమల సమస్య : మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువైతే మొటిమలు, మచ్చలు, మృత కణాల వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే చక్కెర నెల రోజులు ఆపడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు.
బరువు సమస్య : టీ, కాఫీలు తాగడం ఆపడం వల్ల బరువు తగ్గవచ్చు. అలాగే స్వీట్స్ తినడం కూడా తగ్గిస్తే మంచిది.
నోటి సమస్య : చిగుళ్ల వాపు, దంత సమస్యలు, పళ్ళు పుచ్చిపోవడం, దంతాల నుంచి రక్తం రావడం వంటి సమస్యలతో బాధపడేవారు పంచదారను తీసుకోకపోవడమే మంచిది
మానసిక స్థితి మెరుగుపరచుకోవడం : నెల రోజులు పంచదార మన శరీరంలోకి వెళ్లకుండా ఉంటే, మెదడులోని హార్మోన్లు సక్రమంగా విడుదలై యాంగ్సైటి ,కోపం ఆందోళన తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.