Tea Cigarette Combination : ధూమపానం ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. అయినా కూడా చాలామంది ధూమపానం చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా టీ తాగేటప్పుడు సిగరెట్ తాగుతూ ఆ కాంబినేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ విషయం తాజాగా జరిగిన అధ్యయనాల్లో వెళ్లడైంది. జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ ఒక నివేదికను ప్రచురించింది.
దాని ప్రకారం..టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల అన్న వాహిక క్యాన్సర్ 30% పెరుగుతుంది అని తేలింది. వేడి టీ తాగడం వల్ల ఆహారపు పైకణాలు దెబ్బతింటాయి. అలాగే టీ తో పాటు సిగరెట్ కూడా కలిపి తీసుకుంటే ఈ కణాలు మరో రెండు రెట్లు ఎక్కువగా దెబ్బతింటాయి. అందరం ఉదయం లేవగానే టీ ని తాగేస్తూ ఉంటాం. దానివల్ల మైండ్ రిలీఫ్ అవుతుంది అనుకుంటాం. కానీ ముఖ్యంగా టీ లో ఉండే కెఫిన్ కడుపులో ఒక ప్రత్యేకమైన యాసిడ్ నీ ఉత్పత్తి చేస్తుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. కానీ అధిక మొత్తంలో కెఫీన్ పొట్టలోకి చేరితే మాత్రం ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టీ లో ఉండే కెఫినే సిగరెట్ లేదా బీడీ లో కూడా ఉంటుంది. ఖాళీ కడుపుతో టీ, సిగరెట్ కలిపి తీసుకుంటే తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.
అయితే చాలామంది రోజులో ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువగా ఒక సిగరెట్ తాగితే ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటారు. నిజానికి అది కూడా ప్రమాదమే అని చెప్పాలి. సిగరెట్ తాగేవారికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. అని చాలా పరిశోధనలో బయటపడింది. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే సాధారణ వ్యక్తులతో పోలిస్తే రోజుకు ఒక సిగరెట్ మాత్రమే తాగే వారిలో గుండెపోటు ప్రమాదం 7% ఎక్కువగా ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ఇది మాత్రమే కాదు మీరు చైన్స్ స్మోకర్ అయితే మీ వయసును 17 సంవత్సరాలు ఈ స్మోక్ తగ్గిచేస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే.. ఇక్కడ ఆరోగ్యానికి ముప్పు టీ, సిగరెట్ కాంబినేషన్ తోనే.. ఒక్క టీ మాత్రమే తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కాకపోతే అధిక కెపిన్ తీసుకోవడం తగ్గించాలి. ఆరోగ్యానికి ఇంత హాని కలిగించే టీ, సిగరెట్ కాంబినేషన్ నీ దూరంగా ఉంచితే సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు పొందవచ్చు.