The Importance of the Brain : మన శరీర భాగాలలో మెదడుకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. మెదడు సరిగా పని చేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మెదడు పనితీరుపైనే శరీర మిగతా భాగాలు కూడా ఆధారపడి ఉన్నాయంటే మెదడుకు గల ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. అయితే మెదడు పనితీరు సక్రమంగా లేకపోతే కనుక మనం ఏ పనిని కూడా సవ్యంగా చేయలేము.
అయితే మెదడు పనితీరును మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను మనం తినవలసి ఉంటుంది. వాటి వల్ల మెదడు పనితీరు మెరుగై జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అమెరికాలోని హార్డ్ వర్క్ మెడికల్ కాలేజీకి చెందిన న్యూట్రీషియన్ సైకాలజిస్ట్లు ఈ విషయాలను వెల్లడిస్తున్నారు. మెదడు, పేగులు ఒకే కణాల నుంచి తయారవుతాయని నిపుణులు చేస్తున్నారు.
సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆకలి నియంత్రణతో పాటు జీవక్రియలకు సంబంధించిన 90% హార్మోన్స్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దానికోసం అయినా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. దానివల్ల మెదడు పనితీరు మెరుగు కావాలంటే.. విటమిన్ బి12, విటమిన్ బి9, విటమిన్ బి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. వీటితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే వాటిని కూడా తీసుకుంటే మంచిది. అలాగే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి.
పెరుగును తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. వాల్ నట్స్ లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల వాల్ నట్స్ ని తీసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. వీటితోపాటు డార్క్ చాక్లెట్,( Dark Chocolate) తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, పాలను ఆహార పదార్థాలుగా తీసుకుంటే మెదడు పనితీరు బాగుపడడమే కాక జ్ఞాపకశక్తి పెరుగుతుంది.