Thyroid : మహిళల్లో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. ఇది పురుషులకంటే ఎక్కువగా మహిళల్లోనే రావడం జరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ థైరాయిడ్ అనేది హార్మోన్ల అసమతుల్యాత వలన ఏర్పడుతుంది. ఆహారం నుంచి వచ్చే శక్తిలో తీవ్ర సమస్యలు థైరాయిడ్ వచ్చిన వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ T3 అంటే ట్రైయోడోథైరోనిన్ అని..T4 అంటే థైరాక్సిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.
శ్వాస, శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియ, కండరాలు, కొలెస్ట్రాల్, హృదయ స్పందనల సమతుల్యత, ఎముకలు బలంగా ఉండడం లో ఈ హార్మోన్లు ఉపయోగపడుతుంటాయి. ఒకవేళ ఈ హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటే వచ్చేదే థైరాయిడ్. ఇలాంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్య వచ్చేటప్పుడు వారి శరీరంలో వివిధ మార్పులను గమనించవచ్చు. అలాంటి మార్పులు కనిపించగానే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
థైరాయిడ్ లక్షణాలు తెలుసుకుందాం.. థైరాయిడ్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలేమి, గాడ నిద్ర పట్టకపోవడం, శరీరం అలసటకు గురికావడం వంటివి థైరాయిడ్ వచ్చేముందు జరుగుతూ ఉంటాయి. ఇవి గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తక్కువ లిబిడో : తక్కువ లిబిడో అనేది ఒక విధమైన లైంగిక సమస్య. కొంతమంది మహిళలు సెక్స్ పట్ల కోరికలు కోల్పోతారు. సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ సులభంగా అలసిపోతారు. ఇలాంటి లక్షణాలు థైరాయిడ్‌కు దారి తీస్తాయని, ఇది కూడా హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అలసట, బలహీనత : చాలామందిలో పోషకాల లోపం వల్ల కూడా అలసట, బలహీనత అనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు కనుక ఎక్కువగా కనిపించినట్లైతే ఇది థైరాయిడ్ యొక్క మొదటి లక్షణంగా భావించవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. బాగా నిరసంగా ఉన్నప్పుడు ఎటువంటి పనిచేయడానికి కూడా వీరు ఇష్టపడరు. కాబట్టి పైన చెప్పిన వాటిల్లో ఏ లక్షణాలు కనిపించినా వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.