Tips for Sleeping : మనిషి మనుగడ సాఫీగా సాగాలి అంటే.. సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అని అంటే.. నిద్ర, ఆహారం, నీరు అతి ముఖ్యమైనది. ఈ మూడిట్లలో ఒకటైనటువంటి నిద్ర సరిగా లేకపోతే మనిషి యొక్క శరీరం చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర శరీరం యొక్క అలసటను తగ్గించడమే కాక.. మెదడును చురుకుగా పనిచేసేలాగా జీర్ణశక్తిని మెరుగ్గా పనిచేసే విధంగా చేస్తుంది. నిద్ర మనిషి యొక్క శరీరంలో ఆలోచన మరియు ఆచరణలో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. రాత్రంతా మేల్కొని ఉంటే ఖచ్చితంగా మూడు వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తపోటు సమస్య : రాత్రంతా సరిగా నిద్రలేని వారు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య రక్తపోటు. 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్ర పోవాలి. లేకపోతే రక్తపోటు వేగంగా పెరిగిపోతుంది. ఒకవేళ మీరు రక్తపోటుతో బాధపడే వారైతే నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం మీరు ప్రమాదాన్ని చూడవలసి ఉంటుంది.
హృదయ స్పందన రేటు తగ్గే ప్రమాదం : మీరు తరచుగా నిద్ర లేకుండా ఉంటే మాత్రం రక్త పోటు సమస్య పెరిగిపోయి, గుండె వాపుకు దారితీస్తుంది. ఇది గుండెపై తీవ్రమైన ఒత్తిడినీ కలిగించడమే కాక హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది. నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తి క్రమరహిత హృదయ స్పందనలతో బాధపడే అవకాశాలు కూడా ఎక్కువ అని పరిశోధనలో వెల్లడైంది.
గుండెపోటు ప్రమాదం : నిద్రలేమితో బాధపడే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం అధికమనే చెప్పవచ్చు. ప్రతిరోజు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 20% అధికంగా ఉంటాయి. అలాగే నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు మరియు రక్తంలో చక్కెర శాతం పెరగడం గుండెపోటుకు దారి తీయవచ్చు.