Tips of the Eyes : “సర్వేంద్రియానం నయనం ప్రధానం” అన్నారు పెద్దలు. శరీరంలో ముఖ్యమైన భాగాలలో కళ్ళు ప్రత్యేక స్థానం కలవి. ఈ ప్రపంచాన్ని మనం చూడాలి అంటే ఖచ్చితంగా కంటిచూపు ఉండాలి.. ఈ రోజుల్లో మనం తీసుకునే కల్తీ ఆహారం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, వయసుతో సంబంధం లేకుండా చాలామందికి కంటిచూపు మందగిస్తూ ఉంటుంది. అలాంటివారు చూపు సరిగా కనిపించక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
కంటి చూపు మెరుగవడానికి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజులలో చాలామంది టీవీలకు, మొబైల్ ఫోన్లకు చాలా అడిక్ట్ అయిపోయారు. మొబైల్ స్క్రీన్ ని ఎక్కువ సేపు చూడడం, టీవీని ఎక్కువసేపు వీక్షించడం ద్వారా కూడా కంటి చూపు మందగిస్తుంది. దానివల్ల కంటి చూపు చాలా బలహీన పడుతుంది. కంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడం ఒక్క ఆహార పదార్థాల ద్వారానే సాధ్యం.
విటమిన్ సి కంటి చూపును మెరుగుపరచడంలో ప్రధాన భూమికను పోషిస్తుంది. విటమిన్ సి ఏ ఆహార పదార్థాలలో లభిస్తుందో వాటిని రోజువారి తినే ఆహారంలో చేర్చుకుంటే కంటిచూపు మెరుగవుతుంది. విటమిన్ సి ముఖ్యంగా నారింజపండులో ఎక్కువగా లభిస్తుంది. నారింజ పండులో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. విటమిన్ సి రక్తపోటు కూడా నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
అలాగే నానబెట్టిన బాదంపప్పు, ఎండుద్రాక్ష అత్తిపండ్లు లాంటివి తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలను కూడా చేర్చితే కంటిచూపు మసక నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు ఒక గుడ్డు తినమని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. రోజువారి ఆహారంలో గుడ్డును చేర్చి తినడం వల్ల కంటి చూపు చురుగ్గా అవుతుంది.
ఆహారంతో పాటు కళ్ళకు చిన్న వ్యాయామం కూడా చేస్తే ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ళకు చేసే వ్యాయామం ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. రెండు చేతులను కళ్ళపై ఉంచి వాటిని నెమ్మదిగా కాసేపు రుద్దిన తర్వాత తీసేయాలి. లేదంటే ఐబాల్ ని కూడా ఎడమ నుంచి కుడికి క్రిందికి, పైకి తిప్పి కళ్ళ వ్యాయామం చేయవచ్చు. దీనివల్ల కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి.