Vastu Tips : ఎంత కష్టపడినా కూడా ఒక్కోసారి ఫలితం దక్కదు. ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పని చేసిన అందులో ఫలితం శూన్యంగానే ఉంటుంది. జీవితంలో కొన్ని దోషాలు ఉండడం వల్ల వ్యాపారం చేసిన అందులో అభివృద్ధి కనిపించదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకదు.
లేకపోతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆ దోషాలకు ఎలాంటి నివారణ ఎలాంటి చర్యలు తీసుకోవాలి. దోష నివారణకు ఉప్పు చాలా ఉపయోగపడుతుందని పండితులు సూచిస్తున్నారు. ఉప్పును చంద్రుడు లేక శుక్రుడు యొక్క ప్రతిరూపకంగా భావిస్తారు. ఉప్పును సరైన పద్ధతిలో ఉపయోగిస్తే దోషాల నుండి నివారణ పొందవచ్చు.
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిని దూరం చేసుకోవడానికి ఒక గాజు పాత్రలో గుప్పెడు ఉప్పు వేసి దాంట్లో నాలుగు లవంగాలు వేసి ఇంట్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరమై సంతోషంగా ఉంటారు. ఇంట్లో అశాంతి ఉన్నట్లు అయితే, ఉప్పు నీటితో ఇల్లును శుభ్రంగా తుడవాలి. దానివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
దానితోపాటు ఒక గాజు కప్పులో ఉప్పును వేసి ఇంటి యొక్క బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పునీటినీ ఇలా ఉంచడం వల్ల బాత్రూంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం దూరమై ఇంటికి మంచి జరుగుతుంది. పురాణాల ప్రకారం ఉప్పు దీపం పెట్టడం వల్ల లేదా ఉన్న ఉద్యోగంలో పురోగతి సాధించాలి అన్నా.. ఉప్పు నివారణ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఇంటిలో ఉప్పు దీపం పెట్టడం మంచిది.