Vegetarians : ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పౌష్టికాలతో నిండిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలా తీసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ప్రపంచంలోనే శాకాహారులతో ఉన్న దేశం ఒకటి ఉంది. ఈ దేశంలో శాకాహారుల సంఖ్య ఎక్కువ. మరీ ఆ దేశం ఎక్కడ ఉంది.. ఆ దేశంలో శాకాహారులు ఎందుకు ఎక్కువగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక మనిషి జీవన మనుగడలో శాకాహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు తినేవారిలో ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. వీరు ముసలి వయసు వచ్చినప్పటికీ కూడా చాలా ఆరోగ్యంగా జీవిస్తారు. అయితే వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ తాజాగా ఒక సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో భారతదేశంలో శాకాహారం తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉందని వారు వెల్లడించారు.
2022 నుండి 2023 లో జరిపిన ఈ సర్వే ప్రకారం మన భారతదేశంలో ఉన్న జనాభాలో నాలుగింట ఒక వంతు మంది శాఖహారులు ఉన్నారని వెల్లడించారు. అంటే దాదాపు 25% శాకాహారులు మన ఇండియాలో ఉండడం గమనార్హం. ఇజ్రాయిల్ దేశంలో 13 శాతంగా, తైవాన్ లో 12%, ఇటలీలో 10% గా, ఈ శాకాహారులు ఉన్నారని ఆ సర్వేలో తెలిపారు. జర్మనీ మరియు యూకే లో మాత్రం తొమ్మిది శాతంగా ఈ లెక్కలు పరిగణలోకి తీసుకున్నారు. బ్రెజిల్ లో 8 శాతం మంది శాఖాహారులు ఉండగా, ఆస్ట్రేలియాలో ఐదు శాతం ఉన్నారు. అన్ని దేశాలతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కంటే ఎక్కువ మోతాదులో శాఖాహారులున్న దేశం భారతదేశం.