Vitamin b12 Deficiency : మనిషి జీవనశైలి రోజు,రోజుకి చాలా ఒత్తిళ్లతో సాగుతుంది. అధిక పని భారం, వాతావరణ కాలుష్యం వీటి ప్రభావం మానవ జీవన విధానంపై పడుతుంది. అందరూ ప్రతిరోజు పని భారంతో ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం లేదు. వ్యాయామం చేసే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే గంటల తరబడి పనులు చేస్తూ ఉండడం వల్ల ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దానితోపాటు మధుమహం బారిన కూడా పడడం జరుగుతుందని, ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే జీవన శైలిలో తప్పకుండా మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో విటమిన్ బి12 లోపం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ విటమిన్ లోపంతో నాడీమండల వ్యవస్థ దెబ్బతిని మానసికంగా అనారోగ్యా సమస్యల పాలవుతున్నారు.
ఇంకొందరిలో కోపం విపరీతంగా పెరిగిపోయి, అజీర్ణం, అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. విటమిన్ బి12 లోపం కారణంగా విరోచనాలు, వికారం, పొట్టలో తిరగడం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దవారితో పాటు పిల్లల్లో కూడా విటమిన్ బి 12 లోపం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే దీని నివారణకు తీసుకోవలసిన
జాగ్రత్తలు.. పాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లోపం నుంచి తప్పించుకోవచ్చు. పాలను గోరువెచ్చగా చేసి మూడు పూటలా తీసుకుంటే విటమిన్ బి 12 సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల శరీరంలో క్యాల్షియం పరిణామాలు కూడా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కోడిగుడ్లను రోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి వాటితో పాటు పాలకూరలో,క్యారెట్ లో కూడా విటమిన్ b12 అధికంగా లభిస్తుంది.