Vitamin C : మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంతో చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవడం వాతావరణ కాలుష్యం కూడా దీనికి కారణం. దాంట్లో ముఖ్యంగా విటమిన్ సి లోపం బారిన పాడిన వారు అధికంగా సమస్య తీవ్రతను ఎదుర్కొంటున్నారు. శరీరంలో విటమిన్ సి లోపించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం అధికమై అతి ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి విటమిన్ సి లోపాన్ని ఎలా అధిగమించాలి. ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకపక్క విటమిన్ సి లోపం బారిన పడినవారు ఆజాగ్రత్త చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ ఉరుకుల, పరుగుల జీవితంలో అందరూ తప్పక అశ్రద్ధ చేస్తూనే ఉంటారు. అయితే ఆహార పదార్థాల్లో మార్పు వల్ల ఈ సమస్యను అదిగమించవచ్చు. విటమిన్ సి శరీరంలో తగిన మోతాదులో ఉంటేనే తీవ్ర వ్యాదుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే ఎముకలు, చర్మం, రక్తనాళాలు వంటి వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ముఖ్యంగా గాయాలు తగిలినప్పుడు ఇది మాన్పడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ సి లోపం ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి తరచుగా విటమిన్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి లోపం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి: ఈ లోపంతో బాధపడేవారు రోజువారి ఆహారంలో లెమన్, ఆరెంజ్, సీజన్ ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చాలి. అలాగే బ్రొకోలీ, బెర్రీస్, జామ వంటి పండ్లను కూడా డైట్ లో ఉండే లాగా చూసుకోవాలి.
అప్పుడు ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. మానసిక స్థితి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ సి తగిన మోతాదులో శరీరంలో లేకపోతే చాలామంది డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారని నివేదికలో తేలిందని వారు వెల్లడించారు. కాబట్టి రక్తపోటు, రక్తహీనత సమస్యలు కూడా వీటి ద్వారా వస్తాయని, జుట్టు రాలిపోవడం జుట్టు పొడిబారడం లాంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.