Vitamin P : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు అందాల్సిన అవసరం ఉంటుంది. వీటిల్లో ఏది లోపించినా కూడా మనిషి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతాడు. కానీ మనిషి రోజువారీ జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం విషయంలో చాలా అజాగ్రత్తగా మెదులుతున్నాడు. ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయో గమనించుకోకుండా, ఎక్కువగా జంక్ ఫుడ్ కి, ఆయిల్ ఫుడ్ కి అలవాటు పడిపోయాడు.
మనకు ఇంతవరకు విటమిన్ A,C,E,D ల గురించి తెలుసు. కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కొరకు విటమిన్ p అనేది కూడా ఉంటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఫ్లేవనాయిడ్స్ని విటమిన్ P అని పిలుస్తుంటారు. అంటే దీన్ని ఖచ్చితంగా విటమిన్ అని కూడా చెప్పడానికి అవకాశాలు లేవు. దీనికి యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ( Antioxidants, anti-inflammatory ) ప్రాపర్టీలు అని అర్థం కూడా వస్తుంది. మరో రకంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు కలిగిన ఒక ఫైటో న్యూట్రియంట్.
ముఖ్యంగా విటమిన్ P మనకు మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలలో లభిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ P తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెంచడంలో కూడా విటమిన్ P ముందంజలో ఉంటుంది. విటమిన్ P మన శరీరానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ ల పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల కీళ్లవాతం, ఆస్తమా, అలర్జీలు అనేవి మన దరి చేరవు. ముఖ్యంగా వీన్స్, చర్మంపై కమిలినట్లు ఉండడం వంటి వాటిని విటమిన్ P రాకుండా అడ్డుకుంటుంది.
కంటి చూపును మెరుగుపరచడంలో కూడా విటమిన్ P తన వంతు సహాయాన్ని అందజేస్తుంది. కంటి శుక్లాలు రాకుండా అడ్డుకుంటుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా విటమిన్ P అడ్డుకుంటుంది. విటమిన్ P ఎక్కువగా నిమ్మ జాతికి చెందిన పండ్లలో మనకు దొరుకుతుంది. అలాగే హై క్వాలిటీ డార్క్ చాక్లెట్లలోను ఇది మనకు లభిస్తుంది. కాకపోతే చాక్లెట్ కోకో 70% వరకు ఉండాలి.