Walking Benefits For Health : మారుతున్న జీవనశైలిలో చాలామంది ఆరోగ్యాన్ని పట్టించుకోరు. రోజు బిజీ,బిజీగా గడుపుతూ ఎక్కువ సమయం పని మీదనే కేటాయిస్తుంటారు. ఇలాంటి వారికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండదు. మరి ముఖ్యంగా ఎక్కువగా కంప్యూటర్ పైన పనిచేయడం దానివల్ల ఎక్కువసేపు కూర్చొని ఉండడం జరుగుతుంది. ఇలా కూర్చొని పనిచేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వారి రోజువారి దయానందన జీవితంలో నడక లేకపోవడం చాలా ఆరోగ్య ప్రమాదాలకు దారి తీస్తుంది. కనీసం రోజులో 30 నిమిషాలైనా నడవాలి అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. నడక వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం.. వాకింగ్ చేయడం వల్ల కండరాలు చురుగ్గా పనిచేయడమే కాక మన రక్తంలో చక్కెర మరియు రక్తపోటు స్థాయిలు తగ్గుముఖం పడతాయి.
అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయి కూడా నియంత్రణ లో ఉంటూ, నిద్రలేమి సమస్య దూరమవుతుంది అలాగే ఒత్తిడి, చిరాకు వంటివి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్దాలు బయటికి వెళ్లిపోతాయి. శ్వాస రేటు పెరుగుతుంది. వాకింగ్ రక్త ప్రవాహంలో ఆక్సిజన్ వేగంగా ప్రయాణించేలా చేస్తుంది.
వీటితోపాటు జ్ఞాపకశక్తి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. రోజు 30 నిమిషాల నడక కీళ్ళ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో దోహదపడుతూ, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగించడమే కాక శరీరంలో ఉండే అదనపు కొవ్వును కూడా కరిగించి అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది.
శరీరంలో అత్యంత ముఖ్యమైన జీర్ణవ్యవస్థ పనితీరును కూడా నడక మెరుగుపరచడమే కాక, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మీకు ఉండే వీలును బట్టి ఉదయం లేదా సాయంత్రం 30 నిమిషాలు నడవండి.. తర్వాత మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను గమనించండి..ఇంకెందుకు ఆలస్యం వెంటనే మొదలెట్టండి మరీ..