Walking Without Footwear : మన రోజువారి జీవితంలో నడకకు ప్రాముఖ్యత ఉంటుంది. అందరూ ఉదయాన్నే వాకింగ్ చేయడం, సాయంత్రం వాకింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ నడవడం అనేది చెప్పులు లేకుండా మాత్రం జరగదు. చెప్పులు ధరించకుండా నడిచేవారు చాలా అరుదు. నిపుణులు ఏమంటున్నారంటే చెప్పులు లేకుండా నడవడం
వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడి, కంటి సంబంధిత సమస్యలు ఉంటే తొలగిపోతాయి అంటున్నారు. అలాగే శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరగడానికి ఉపయోగపడుతుంది.
చెప్పు లేకుండా నడవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడడమే కాక శరీరము, మనసు ప్రశాంతతను సంతరించుకొని తొందరగా నిద్రపోయే అవకాశాలు ఉంటాయి. భూమి మీద పాదాలు ఆనించి నడవడం వల్ల మెదడు చురుగ్గా పని చేయడమే కాకా, నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు మసాజ్ అయి పాదాల నొప్పులు తగ్గుతాయి.
అలాగే శారీరక నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల బాగా పాదాల కింది భాగంలో నాడులు క్రమబద్ధీకరించబడి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే పాదాల్లో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. నొప్పి, వాపు తగ్గిపోతుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజులో కొద్దిసేపైనా ఇలా నడిచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.