Water Bottle Expiry Date : నీళ్లు మనిషి మనుగడకు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నీరు లేనిదే మనిషి జీవించడం చాలా కష్టం. ఈ ప్రకృతిలో కాలం చెల్లనీది అంటే నీరు ఒక్కటే. నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే మనకు అంత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. నీటిని కాలుష్యం లేకుండా చేసుకుంటే మానవ మనుగడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.
కానీ అలాంటి నీటిని ఇప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లలో పోసి ప్రజలకు అమ్ముతున్నారు. ఇలాంటి బాటిల్లల్లో నీరు తాగడం ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యామ్నాయంగా ఏదీ లేకపోవడంతో ఈ ప్లాస్టిక్ బాటిలన్నే వినియోగిస్తున్నారు ప్రజలు. మరి అలాంటి ప్లాస్టిక్ బాటిల్లకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాటిల్లోని నీరు ఎప్పటికీ పాడవవు. కానీ ప్లాస్టిక్ బాటిల్ మాత్రం కొద్దికాలం వరకే ఉపయోగపడుతుంది. అంటే ప్లాస్టిక్ బాటిల్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని అర్థం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్లోజ్డ్ వస్తువు నాణ్యత దాని భద్రత కాలం తెలుసుకోవడానికి తేదీని వినియోగదారులు వెల్లడిస్తారు. అలాగే బాటిల్ వాటర్ గడువు తేదీ దాని అత్యధిక నాణ్యతను తెలియజేస్తుందని చెప్తున్నారు.
అంటే ఆ గడువులోపే.. దానిలోని నీరు శ్రేష్టం. గడువు దాటిన తర్వాత వాటిల్లోని నీరు తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇచ్చిన తేదీని మీరీ ఆ వాటర్ బాటిల్ లోని నీటిని తాగడం సురక్షితం కాదు. ఎందుకంటే గడువు దాటిపోయిన తర్వాత ప్లాస్టిక్ నీటిలో కరగడం ప్రారంభిస్తుంది. అది చాలా ప్రమాదం. ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య నష్టాలు కలుగుతాయి. కాబట్టి గడువు తేదీని చూసి వాటర్ బాటిల్ వినియోగించడం ఉత్తమం.