Water : మనిషి జీవన మనుగడకు ఆహారం ఎలాగో నీరు కూడా అలాగే. నీరు శరీరానికి తగిన మోతాదులో లభించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు కేవలం దాహం తీర్చుకోవడానికి మాత్రమే కాదు. ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఒక ఔషధంగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి చెడు వ్యర్ధాలు విసర్జింపబడతాయి. ఈ నీరును ఎటువంటి సమయాలలో తీసుకోవాలి. దానివల్ల కలిగే ఆరు ప్రయోజనాలను చూద్దాం.
◆ జీవక్రియ నియంత్రణ : మన శరీరంలో ముఖ్యంగా జీవక్రియ అనేది సక్రమంగా జరగాలి. లేకపోతే ఆ ప్రభావం ఆరోగ్యం పైన పడుతుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహారం మరియు వాటి ప్రసరణ సరిగా సాగాలి అంటే మన శరీరానికి తగిన మోతాదులో నీరు అవసరం.
◆ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి : కాలాలతో పని లేకుండా ఏ కాలంలోనైనా శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం అతి ముఖ్యం. ఈ పని చేయడంలో నీరు మన శరీరానికి సహాయపడుతుంది. శరీరం హైడ్రేషన్ అయినట్లు ఉంటే ఆ ప్రభావం శరీరంలోని ఇతర భాగాల పైన చూపుతుంది. ముఖ్యంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి శరీరానికి కావలసిన నీరును ప్రతిరోజు తీసుకోవాలి.
◆ జీర్ణశక్తిని దృఢంగా ఉంచుతుంది : మలబద్దకం సమస్యతో బాధపడే వారికి నీరు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆహారం విచ్చిన్నం చేయడంలో నీరు ముఖ్యపాత్రను పోషిస్తుంది. నీరు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు.
◆ శరీర ఉష్ణోగ్రత : కొందరికి శరీర ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. అలాంటివారు నీరును తగిన మోతాదులో తీసుకోవాలి. విపరీతమైన చెమటతో బాధపడేవారు నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
◆ బాడీ డిటాక్స్‌లో సహాయపడుతుంది : శరీరంలో నీరు సక్రమంగా ఉన్నప్పుడు డీలక్స్ ప్రక్రియ బాగుంటుంది. వ్యర్థ పదార్థాలు నీటి సహాయంతో సులభంగా ఫిల్టర్ చేయబడతాయి.
◆ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కోసం : మన శరీరానికి ఖనిజాలు అవసరం కూడా ఎంతగానో ఉంటుంది. వాటిలో ముఖ్యంగా పొటాషియం, క్లోరైడ్, సోడియం వంటివి అవసరం ఒకవేళ ఖనిజాలు లోపించినట్లయితే నీరు ఆ లోపాన్ని సరిచేస్తుంది. కాబట్టి శరీరానికి కావలసినంత నీరు తీసుకోవడం ముఖ్యం.