Zinc Important : మనిషి సంపుర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు సరిగ్గా అందేలాగా చూసుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. అయితే వీటితోపాటుగా జింకు కూడా శరీరానికి సమపాల్లల్లో అందాలి. మన శరీరంలో జింకు లోపిస్తే మనం చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జింక్ లోపించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.
హెయిర్ ఫాల్ సమస్య రావడము, పల్చబడడం జుట్టు రాలిపోవడము, చిట్లాడము లాంటివి అధికంగా ఉంటాయి. బాడీకి సరిపోయేంత జింకు అందకపోతే జీర్ణశక్తి తగ్గిపోతుంది. అలాగే బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఆకలి మందగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ మాత్రమే కాదు జింకు కూడా చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే జింక్ లోపిస్తుందో కంటి చూపు మసకబారుతుంది. జింకు వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.
శరీరం బలహీనంగా మారి రుచి ,వాసన గ్రహించే శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరానికి అవసరమయ్యే జింకను ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. జింకు శరీరానికి అందాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. ముఖ్యంగా గుడ్డు, పుచ్చా కాయ,గుమ్మడి గింజలు, వెల్లుల్లి, జీడిపప్పు, శనగలు వంటి ఆహారంలో మనకు అత్యధికంగా లభిస్తుంది. ఇవి తినడం వల్ల మన శరీరంలో జింకు పుష్కలంగా సమకూరుతుంది. ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు.