Varahi Vijaya Yathra : వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం ఏలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు జన సైనికులు, వీర మహిళల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వాలంటీర్ల విషయంలో ఆడబిడ్డలున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఓ వాలంటీర్లకు సమాచారం ఇచ్చే ముందు వారిని ఎందుకు తీసుకుంటున్నారో అడగండి.
అవసరానికి మించి సమాచారం ఇవ్వకండి అని ఆయన సూచించారు. వాలంటీర్లంతా తప్పు చేస్తున్నారు అని నేను చెప్పడం లేదన్నారు. తులసి వనంలో గంజాయి మొక్క ఒక్కటి ఉన్నా ప్రమాదం.. పది మంచి పళ్లున్న గంపలో ఒక కుళ్లిపోయిన పండు ఉంటే మొత్తం గంపను కుళ్లిపోయిన గంపగానే భావిస్తారు. అలాగే కొందరు తప్పు చేసినా వాలంటీరు వ్యవస్థనంతా అంటారని చెప్పారు.
ప్రభుత్వ శాఖల సిబ్బంది ఉండగా, జగన్ సమాంతర వ్యవస్థను నెలకొల్పాడనీ,, ప్రజా ధనం వినియోగిస్తూ… వైసీపీకి అనుకూలంగా పనిచేయిస్తున్నాడని అని పవన్ చెప్పారు. నియంతల ఆలోచన ఉన్న జగన్ మన ఇంట్లోకి వచ్చి మనందరినీ కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. వాలంటీర్లను ప్రజలంతా ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ఈ వ్యవస్థ అత్యంత ప్రమాదరకంగా మారుతుంది.జగన్ నువ్వేన్ని కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్.
నేను వాలంటీర్ల మీద అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. జగన్ నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు. ఖచ్చితంగా రాబోయే విపత్తును ముందే చెబుతున్నాను. నాకు తెలిసిన కీలకమైన సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తూనే ఉంటా. వాలంటీర్లు ప్రతి ఇల్లు తిరుగుతూ సమాచారం అడుగుతున్నారు. ప్రతి ఇంటి డేటా తీసుకుంటున్నారు. ఎంత మంది ఉంటున్నారు..? వారేం చేస్తున్నారు..? ఎప్పుడు బయటకు వెళ్తారు..? ఎలా వెళ్తారు..?
వారి బంధువులు ఎవరు ఇలా అన్ని కీలకమైన వివరాలు తీసుకుంటున్నారు. మైక్రో లెవల్లో సున్నిత సమాచారం తీసుకొంటున్నారు. ఈ సమాచారం పక్కదోవ పడుతుంది అని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు..గ్రామాల్లో అతి సున్నితమైన సమాచారం ఎటు
వెళ్తుందో, ఎలా వెళ్తుందో కూడా తెలియడం లేదు. అది ఒక్కోసారి వాలంటీర్లకు తెలియకుండా కూడా బయటకు వెళ్లింది. వాలంటీర్లు అందరినీ నేను అనడం లేదు. తప్పు పట్టడం లేదు. వాలంటీర్ల వద్ద ఉన్న కొంత సమాచారం బయటకు వెళ్తుంది. “బాగున్నారా బ్యాచ్” అని పేరు పెట్టి, శాఖల వ్యవస్థలను నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థను ఎందుకు వైసీపీ ప్రోత్సహిస్తోంది అని పవన్ తెలిపారు.