AAA Cinemas Inaugurated : నగరం నడిఒడ్డులో.. అమీర్ పేట్ జంక్షన్లో.. యూత్ ఇబ్బడిముబ్బడిగా తిరిగే ప్లేస్‌లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న సత్యం థియేటర్‌కు గొప్ప చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరంలో తొలినాళ్లలో నిర్మించిన 70ఎంఎం సినిమా థియేటర్లలో సత్యం ఒకటి. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ స్థానంలో ఇప్పుడు ఓ మల్టీప్లెక్స్ వెలసింది. మల్టీప్లెక్స్, నిర్మాణ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో

కలిసి AAA సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) స్థాపించారు. అత్యాధునిక హంగులు, విలాసవంతమైన సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఏషియన్ సత్యం మాల్ & మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తవడంతో ఈ రోజు అల్లు అర్జున్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు బాబీ, కొడుకు అల్లు అయాన్ తదితరులు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ మన అమీర్ పేటకు రావడంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేశారు.
అమ్మాయిలు సైతం అబ్బాయిలకు పోటీగా అల్లు అర్జున్ ను చూసేందుకు ఎగబడ్డారు. ఈలలు, కేకలతో థియేటర్ ప్రాంగణం మారుమ్రోగింది. బన్నీతో సెల్ఫీ దింగేందుకు అంతా ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక రేపు రిలీజ్ అయ్యే ఆదిపురుష్ సినిమాను ఈ థియేటర్లోనే ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ చేశారు బన్నీ అండ్ టీం. 3Dలోనూ.. 2Dలోనూ.. ప్రభాస్ సినిమాను స్క్రీనింగ్ చేసి.. తన థియేటర్ కలెక్షన్స్‌కు మాంచి బూస్టప్ ఇవ్వనున్నారు.
#AlluArjun fans hungama at #AAACinemas launch as Allu Arjun visits the multiplex at Ameerpet!
The theatre complex will start with #Adipurush screening in all 5 screens tomorrow! pic.twitter.com/qvTD8IcA1W
— idlebrain.com (@idlebraindotcom) June 15, 2023