Adipurush Controversial Dialogue : గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మేనియా కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేయగా.. ఇందులో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. రామాయణం ఆధారంగా తెరకెక్కగా ఈ మహాకావ్యాన్ని బిగ్ స్క్రీన్స్ చూసి ఆడియన్స్ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.
అయితే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం నేపాల్ లో మాత్రం విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆదిపురుష్ మూవీలో సీతాదేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సీన్ ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ ను అడ్డుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో
ఆదిపురుష్ మూవీని బ్యాన్ కూడా చేశారు. ఆ డైలాగ్ తొలగిస్తే కానీ రిలీజ్ చేయమని కండిషన్ పెట్టడంతో ఆదిపురుష్ మేకర్స్ దిగిరాక తప్పలేదు. చివరకు వివాదానికి కారణమైన ఆ డైలాగ్ ని తొలగించారు మేకర్స్. దీంతో నేపాల్ లో మూవీ రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యింది. కానీ మార్నింగ్ షోస్ ఆగిపోయాయి. నేపాల్ ప్రజలు సీతాదేవిని నేపాల్ కుమార్తెగా భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి.