Adivi Sesh Major : దేశం కోసం.. ప్రాణ త్యాగం చేసిన వీరుడి గురించి రూపొందిన మూవీ ‘మేజర్’. ముంబైలో 26/11 ఉగ్ర దాడి జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం త్యాగం చేసిన వీరుల్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఒకరు. విలక్షణమైన కథలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ ఈ సినిమాలో సందీప్ పాత్రలో నటించగా.. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ..
తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ సినిమా చూసి అడివి శేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల మేజర్ సినిమా చూసి నచ్చడంతో అడివి శేష్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అడివి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి చర్చించారు. దీంతో అడివి శేష్ రామ్‌నాథ్ కోవింద్ ని కలవడంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. రామ్‌నాథ్ కోవింద్ ని కలిసిన వీడియోని అడివి శేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..
మేజర్ సినిమా రిలీజై సంవత్సరం కావొస్తుంది. ఇంకా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారిని కలిశాను. ఆయన మేజర్ సినిమా చూసి దాని గురించి మాట్లాడటం నేను మర్చిపోలేను. నా లైఫ్ లో ఇదొక మర్చిపోలేని మూమెంట్ అంటూ ఎమోషనల్ గా పోస్టు చేశాడు. దీంతో అడివి శేష్ ని అంతా అభినందిస్తున్నారు. ఇటీవల హిట్2 తో హిట్ కొట్టిన శేష్, ప్రస్తుతం గూఢచారి 2 మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు.
https://www.instagram.com/reel/CsSY0TbSyxG/?igshid=MzRlODBiNWFlZA==