Ambati Rambabu Fire on Ramoji Rao : ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు తుఫాను విషయమై స్పందించారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్లనే తుఫానుపై ప్రాణ నష్టం కాకుండా కేవలం ఆస్తి నష్టంతో బయటపడగలమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు, చంద్రబాబు రాజకీయాన్ని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా నీచమైన ఆలోచనలతో సీఎం జగన్ పై బురద జల్లుతున్నారని, చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా ఈ విధమైన వింత ప్రచారానికి మొగ్గు చూపుతున్నారని, దాంట్లో భాగంగానే ఈనాడులో రామోజీరావు చాలా నీచమైన విషయాలు మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల రామోజీరావుకి ఎంత లాభం చేకూరుతుందో, చంద్రబాబు లాగా షో చేయడం సీఎం జగన్ కి రాదని అంబటి రాంబాబు రామోజీరావు పైన మండిపడ్డారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటి కంటే వైయస్ జగన్ సీఎంగా ఆ ప్రజలను ఆదుకున్నాడు. మీకంటే ఎక్కువ నష్టపరిహారాన్ని ఇచ్చాడని రాంబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులను శంకుస్థాపన చేసింది వైయస్సార్, వాటిని సంపూర్ణంగా సఫలం చేసే దిశగా అడుగులు వేస్తుంది వైయస్ జగన్ అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలను సంక్షేమం దిశగా తీసుకువెళ్ళింది వైయస్ రాజశేఖర్ రెడ్డి గారని, ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోవడం హాస్యాస్పదంగా ఉందని రాంబాబు వెల్లడించారు. కేవలం తెలుగుదేశం నీచమైన రాజకీయం వల్లనే గుండ్లకమ్మ కు ఆరోజు ఆ దుస్థితి ఏర్పడిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అచ్చెమ్మ నాయుడు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
గుండ్లకమ్మ రిపేరు చేయాలని డ్యామ్ సేఫ్టీ సూచించిందని, ఇదంతా టిడిపి హయాంలోనే జరిగిందని మరోమారు అంబటి రాంబాబు తెలిపారు. ఐదు కోట్లతో ఆ రోజే సక్రమంగా రిపేర్లు చేసి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కూడా రాంబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన మేము పనులు చేస్తున్నాం. స్టాపేజ్ పెట్టి నీటిని నిల్వ చేస్తున్నాం. గుండ్లకమ్మ విషయంలో టిడిపి చేసిన పాపాన్ని మీ మోయాల్సి వస్తుందని అంబటి రాంబాబు చంద్రబాబు పైన విరుచుకుపడ్డారు.