CM KCR Second Phase Campaign : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఒకవైపు తమ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ మద్దతు తెలుపుతూ, ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దాంట్లో మొదటి భాగంగా నవంబర్ 9న నామినేషన్లు వేసిన కామారెడ్డి సభతో మొదటి విడత షెడ్యూల్ ని పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు రెండో విడత జన ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొననున్నారు. దీనికోసం సీఎం మూడు రోజులు బ్రేక్ తీసుకున్నారు.
ఒకవైపు కాంగ్రెస్, బిజెపి తమ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కొత్త పంతాలు ఎంచుకొని, తను రోజులో మూడు లేక నాలుగు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ రకంగా చూసుకుంటే 16 రోజుల్లో మొత్తం 54 సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 28న వరంగల్ తూర్పు, పశ్చిమ, గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ ప్రజల నాడి ఎటువైపు ఉందనే విషయం ఇప్పటికీ ఏ సర్వే కూడా తేల్చలేకపోయింది.
ఓటరు మనసులో ఏ పార్టీ ఉంది అనేది స్పష్టంగా తెలియడం లేదు. చివరి నిమిషం వరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగేలాగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒకవైపు కాంగ్రెస్ దే పై చేయి అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు లేదు బి ఆర్ ఎస్ పార్టీనే మళ్లీ గెలుస్తుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక బీజేపీ విషయానికొస్తే బీఆర్ఎస్ తో, కాంగ్రెస్ తో బిజెపి పోటీ పడేంత సీన్ తెలంగాణలో లేదని స్పష్టమవుతుంది.
బీజేపీ కుల రాజకీయాలతో కొత్త పాట పాడుతున్నప్పటికీ, అది ఏమాత్రం తెలంగాణలో ప్రభావం చూపేలాగా కనిపించడం లేదు. ఓటరు దృష్టి ఎటువైపు ఉంది అనే విషయం తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు విడుదల అయితే తప్ప అది సాధ్యం కాదు.