Election Schedule : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్గఢ్లో మాత్రం రెండు దశల్లో జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా..
తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవికాలం 2024 జనవరి16న ముగియనుంది. 2018లో డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇక మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత పదవికాలం 2024 జనవరి 6న ముగియనుంది. 2018 నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2024 జనవరి 14న అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది.
2018లో తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్7న ఎన్నికలు జరిగాయి. ఇక ఛత్తీస్గఢ్లో 2018 నవంబర్ 12 మరియు నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్ పదవీకాలం 2024 జనవరి 3న ముగియనుంది. మిజోరాంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా… అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం 2023 డిసెంబర్ 17 న ముగియనుంది.