Nadendla Manohar – Veera Mahilalu : 77 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలో జనసేన వీర మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రౌడీయిజానికి పన్ను వేస్తే ప్రజలపై లేనిపోని పన్నులు, వడ్డింపులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసింది. రాష్ట్రంలో రౌడీయిజం చేసే వారిపై పన్నులు వేస్తే… ప్రజలను పట్టి పీడిస్తూ రౌడీయిజం, గూండాగిరీని నమ్ముకున్న వైసీపీ నాయకులు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వ ఖజానా నిండిపోతుంది.
ప్రభుత్వ రెవెన్యూ లోటు తీరిపోతుంది. అంతటి దారుణాలను వైసీపీ నేతలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల దాష్టీకాలను, దుర్మార్గాలను చూసి ప్రజల్లో విపరీతమైన కోపం ఉంది. అది ఖచ్చితంగా వైసీపీ నాయకులకు నామరూపళ్లకుండా వచ్చే ఎన్నికల్లో చేస్తుంది. గతంలో వీపీ సింగ్ ప్రభుత్వంలో పన్ను ఎగవేతలను, నల్లధనాన్ని బయట పెట్టడానికి ఓ వినూత్న ప్రయత్నం జరిగింది. నల్లడబ్బు ఉన్న వారి వివరాలు, పన్నులు కట్టని వారి వివరాలను రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన వ్యక్తులకు
బయటపెట్టిన ఆస్తిలో 5 శాతం ప్రోత్సాహక బహుమతి కింద అందజేసేవారు, పవానన్న ప్రభుత్వంలోనూ అలాంటి ప్రయత్నం చేస్తాం. క్షేత్రస్థాయిలో జరిగి అక్రమాలను, అవినీతి తరంగాలను బయటపెట్టేవారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందించేలా ఏర్పాటు చేస్తాం. వనరుల దోపిడీ, సంపదను కొల్లగొట్టి వారిని నిలువరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రజల నుంచే సమాచారం సేకరించి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టి వారి పని పడతాం.
పార్టీలతో, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల ఆస్తులను దోపిడీ చేసేవారికి ఖచ్చితంగా జనసేన ప్రభుత్వంలో తగిన శిక్షలు ఉంటాయి. జనసేన ప్రజా కోర్టులో నిలబెడతాం. ప్రజాస్వామ్య దేశంలో బలమైన చట్టాలు, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ నేటి పరిస్థితుల్లో ప్రతి చిన్న అంశానికి సామాన్యుడు కోర్టుల చుట్టూ తిరగులేని పరిస్థితి ఉంది. జనసేన త్వరలోనే వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, దోపిడీలపై ప్రజాకోర్టు నిర్వహిస్తుంది. దీనిని ఎలా ప్రజలకు చేరువ చేయాలనేది నిర్ణయిస్తాం.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులకు న్యాయస్థానాలు అయితే ఎలాంటి శిక్షలు వేస్తాయి..? అసలు వైసీపీ నాయకుల తప్పులకు న్యాయపరంగా ఎలా స్పందించాలి అనే విషయాలను ప్రజాకోర్టులో తేలుస్తాం. వైసీపీ నాయకుల తప్పులకుప్పలు ఎక్కడికి వెళ్లినా అంతు లేకుండా కనిపిస్తున్నాయి. వారిని ఖచ్చితంగా ప్రజాకోర్టులో నిలటెడతాం. వారు చేస్తున్న తప్పులు రాజ్యాంగానికి ఎంత విరుద్ధమైనవో తెలియజేస్తాం అని నాదెండ్ల వెల్లడించారు.