Pawan Kalyan – Andhra : వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల గుట్టురట్టు చేశారు పవన్ కళ్యాణ్. ఆయన చేపట్టినటువంటి వినూత్న ఆలోచన విధానమైన వారాహియాత్ర, ఋషికొండ సుదర్శనం ఇవన్నీ కూడా ప్రభుత్వ అక్రమాలను బట్టబయలు చేసే లాగానే ఉన్నవి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని నిజాలను నిర్భయంగా బయట పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాకా దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారు అని నేను మాట్లాడితే నా మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పింది నిజమని తేలింది. ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారు. ఇది నేను చెబుతున్నది కాదు. నోబుల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి గారు చెప్పారు. అసలు చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో, మాయం అవుతున్న చిన్నారులు ఏమవుతున్నారో కూడా వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు.
చిన్న బిడ్డలు ఉన్న వారు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. విశాఖ ప్రశాంతమైన నగరం. క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉండేది. అలాంటి ప్రాంతంలోనే నేడు హ్యుమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉంది. బయటకు రావొద్దు, అభివాదం చేయొద్దు అని నాకు ఆంక్షలు విధిస్తారు. వాలంటీర్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. పోలీసులు వారి పని వాడు చేస్తే సమాజంలో నేరాలు ఉండవు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చేతులు కట్టిస్తున్నారు. వారు చెప్పినట్లుగా పోలీసులు వినాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
దీంతో అసాంఘిక శక్తులు పెట్రోగిపోతున్నాయి. వ్యవస్థలను సక్రమంగా పని చేయనిస్తే నేరాలే జరగవు, వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడుకోవడమే జనసేన లక్ష్యం. చిన్న పిల్లలు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న చోట చుట్టు పక్కల వాళ్లు ఆ ఇంటికి ఎవరెవరూ వస్తున్నారో అన్న దానిపై కన్నేసి ఉంచండి. అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
స్టేషన్ కు వెళ్లలేకపోతే సోషల్ మీడియాలో అయినా వివరాలు పోస్టు చేయండి. అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలోని శాంతిభద్రతల సమస్యపై స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రక్షణ లేకుంటే ఉమ్మడిగా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పాలకపక్షంపై పోరాడాల్సిన సమయం ఇది.