Pawan Kalyan v/s Jagan : మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కి సవాల్ విసిరారు. జగన్ చేస్తున్న కుళ్లు రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. ఆయన ప్రశ్నల్లో నిజాలని స్పష్టతను వివరిస్తూ.. వెన్ను చూపాబోమని తెలిపాడు. జగన్ నీ ఇష్టం… సై అంటే సై తేల్చుకుందాం. దేనికైనా నేను రెడీ.
వాలంటీర్ అనే జగన్ సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. ఇదే నీ ప్రభుత్వ పతనానికి మొదటిమెట్టు. ఈ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనని గుర్తుంచుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని హెచ్చరించారు. నేను ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను.. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే మాట్లాడతాను అన్నారు.
ఎటు వైపు నుంచైనా రిస్క్ తీసుకోవడానికి సిద్దపడే ప్రజల ముందు నిజాలు బయటపెడతానని చెప్పారు. జైలుకెళ్లడానికైనా… దెబ్బలు తినడానికైనా సిద్ధమని ప్రకటించారు. అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి తప్పు జరిగితే ఖచ్చితంగా ఎత్తి చూపుతామని పవన్ జగన్ కి సవాల్ విసిరారు. కేసులకు, విచారణలకు భయపడేవాడిని కాదు. అది ఎవరి గురించి అయినా, ఏ సమాంతర వ్యవస్థ గురించి అయినా నేను చెప్పాలనుకున్నది చెబుతానని స్పష్టం చేశారు.
నేను ప్రజా పోరాటంలో జైలుకు వెళ్లడానికి అయినా, దెబ్బతినడానికి అయినా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. జగన్ గుర్తు పెట్టుకో… నీకు నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. నా దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అభ్యున్నతి మీదనే ఉంటుంది. 21వ శతాబ్దంలో ప్రజల వ్యక్తిగత సమాచారం అనేది అత్యంత కీలకమని బ్రిటీషు సాంకేతిక నిపుణుడు హంబీ అంటారు. ప్రజల డేటా అనేది కూడాయిల్ కంటే విలువైనదని చెబుతారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రశ్నిస్తూనే ఉంటాను..నిజాలు నిగ్గు తేలే వరకు..దేనికి భయపడబోను అని పవన్ స్పష్టం చేసారు.