Dude Movie: ‘డ్యూడ్’కు రికార్డు వసూళ్లు.. తొలి రోజే 80% బడ్జెట్ రికవరీ, ప్రదీప్ రంగనాథన్‌కు మరో హిట్
Dude Movie: ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు పొందిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటించింది. కీర్తిస్వరన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఇటీవల గ్రాండ్‌గా విడుదలైంది.
‘డ్యూడ్’ సినిమాకు తమిళం, తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కొన్ని చోట్ల మిశ్రమ స్పందనలు కనిపించినా, కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ. 27 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విడుదలైన మొదటి రోజే ఈ మొత్తం బడ్జెట్‌లో దాదాపు రూ. 22 కోట్లు వెనక్కి రాబట్టడం విశేషం. అంటే, తొలి రోజే దాదాపు 80 శాతం బడ్జెట్‌ను రికవర్ చేసుకుని, నిర్మాతలు లాభాల బాట పట్టారు.
‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ఎంత పెరిగిందో ఈ సినిమా వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండో రోజు కలెక్షన్లు గట్టిగా నిలబడ్డాయి. ఈ వసూళ్ల జోరు చూస్తుంటే, ‘డ్యూడ్’ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌కు మరో భారీ విజయాన్ని, ‘లక్కీ ప్రాజెక్టు’గా నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త దర్శకుడు కీర్తిస్వరన్‌కు కూడా తొలి ప్రయత్నంలోనే ఇంతటి భారీ విజయం దక్కడం విశేషం.
