Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ తెరకెక్కుతున్న సీక్వెల్ మూవీ పుష్ప 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మూవీ టీం తాజా షెడ్యూల్ మరేడుమిల్లిలో జరగ్గా నిన్నటితో షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీంతో మూవీ టీం తిరిగి హైదరాబాద్ పయనమయ్యింది. అయితే 3 బస్సుల్లో ఆర్టిస్టులు వస్తుండగా ఓ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది.
నార్కట్పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పుష్ప-2 ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆగివున్న మరో ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.