Smart Phone : ఈ రోజుల్లో మొబైల్ వాడకుండా ఎవరు ఉండడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కనిపిస్తూనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ మన రోజువారి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేకుండా మనం ఇప్పుడు ఏ పని చేయలేని సిచ్యువేషన్ లోకి వచ్చేసాము. కానీ అలాంటి ఫోను కొత్తలో ఉన్నట్టుగా.. వాడుతూ ఉంటే అంతగా పని చేయదు. స్లోగా దాని పనితీరును తగ్గుతుంది.
ఫోన్లో కొద్ది రోజుల తర్వాత బ్యాటరీ స్పీడ్, చార్జింగ్ ఆలస్యంగా కావడం, ఫోన్ అప్పుడప్పుడు స్ట్రక్ అయి ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. మన స్పీడ్ లైఫ్ కి ఫోన్ లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే అర్జెంటు పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో ఫోన్లో చార్జింగ్ స్పీడ్ గా కావాలంటే కొన్ని ట్రిప్స్ మనకు బాగా పనిచేస్తాయి.. అవేంటో తెలుసుకుందాం..
ఫోన్ కవర్ : చాలామంది ఫోన్ సెక్యూరిటీ కోసం ఫోన్ కి కవర్ నీ వాడుతుంటారు. చార్జింగ్ పెట్టినప్పుడు, దానికి ఉన్నటువంటి ఫోన్ కవర్ తీయకుండా అలాగే చార్జింగ్ పెట్టేస్తారు. దానివల్ల ఫోన్ వేడెక్కుతుంది. చార్జింగ్ కూడా చాలా స్లోగా అవుతుంది. కాబట్టి కవర్ తీసేసి చార్జింగ్ పెట్టడం మంచిది.
ఏరోప్లేన్ మోడ్ : ఫోన్ చార్జింగ్ స్పీడ్ గా కావాలంటే ఫోన్ ని ఏరోప్లేన్ మోడ్ లో ఉంచడం వల్ల నెట్వర్క్ సేవలనుండి యాప్స్ పనిచేయడం వరకు అన్నీ ఆగిపోతాయి. బ్యాటరీ వినియోగం కూడా ఆగిపోతుంది. కాబట్టి చార్జింగ్ స్పీడ్ గా అవుతుంది.
ఫోన్ స్విచ్ ఆఫ్ : ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల డిస్ ప్లే కూడా బ్యాటరీ వినియోగించదు. దానివల్ల చార్జింగ్ స్పీడ్ గా అవుతుంది. అత్యవసరమైనప్పుడు ఈ పద్ధతిని వాడవచ్చు.