Aloe Vera : ఈ రోజుల్లో అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందం కోసం ఎంత ఖర్చు చేయడానికి వెనుకాడరు. చర్మ సౌందర్యం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల కెమికల్స్ తో కూడిన వాటిని స్కిన్ లోషన్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడుతుంటారు. అయితే ఇవన్నీ చాలా ఖర్చుతో, అలాగే రసాయనాలతో నిండి ఉంటాయి. వీటితో సంబంధం లేకుండా ముఖ వర్ఛస్సు మన ఇంట్లో చుట్టుపక్కల దొరికే ప్రకృతి సిద్ధమైన వనరులతో కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
ముఖ్యంగా మన పెరట్లో లభించే మూలికలు, మన చుట్టుపక్కల దొరికేటటువంటి ఆకుల రసాలతో అందాన్ని పెంచుకోవచ్చు. వాటిలో అలోవెరా జెల్ ప్రధానమైనది. అలాగే మునగాకు రసం కూడా చర్మవర్ఛస్సును పెంచడంలో సహాయపడుతుంది. ముఖంలో అందం, సహజత్వం పెరగాలంటే మునగాకు రసం ఔషధంలా పనిచేయడమే కాకుండా ముఖం మీద ఉన్నటువంటి మచ్చలను దూరం చేస్తుంది. మునగాకును తీసుకొని మెత్తగా రుబ్బి దానిద్వారా వచ్చే రసాన్ని ప్రతిరోజు
ముఖానికి, మెడకు అప్లై చేసి ఉదయం లేవగానే గోరువెచ్చ నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉండేటటువంటి మొటిమలు, ముడతలు, నలుపు ఛాయలు క్రమంగా తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చాలామంది కళ్ళకింద నలుపు, ముడతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు ప్రతిరోజు ఒక కప్పులో పాలని తీసుకొని, అర స్పూన్ తేనెను కలిపి ముడతలు, నలుపు ఉన్న భాగాల్లో నిద్రకు ముందు అప్లై చేసి గోరువెచ్చ నీటితో ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.
వారం రోజుల్లో ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. అలాగే ముఖంపై షైనింగ్, పెదవులు పగుళ్లు లాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి అలోవెరా చక్కటి పరిష్కారంగా ఉంటుంది. అలోవెరాను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో వర్ఛస్సు పెరగడమే కాక ముఖంపై ఉన్నటువంటి మొటిమలు, మచ్చలు అన్ని మాయం అవుతాయి. వీటన్నిటితోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యం.