Signs Before Death : మనిషి చనిపోయే ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ క్షణాన ఎవరి మనసులలో ఎటువంటి ఆలోచనలు వస్తాయో కూడా మనం ఊహించలేము. కానీ మనిషి చనిపోయే ఐదు నిమిషాల ముందు ఆ విషయం వారికి తెలుస్తుంది అంట. ఇది కాస్త నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ .. మన పురాణాల్లో కూడా ఈ విషయం ప్రస్తావించాడం విశేషం. అలాగే కొందరు నిపుణులు చేసిన స్టడీలో ఇది నిజమే అని తేలింది.
అమెరికాకు చెందిన సైంటిస్టులు తాజాగా ఈ అంశం పైన ఓ స్టడీ చేశారు. ఆ నివేదిక ప్రకారం.. చనిపోయే ముందు ఆ చివరి క్షణాలలో మనీషి దేని గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ మనసులో మెదిలే విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* అందరికీ వారి పిల్లలు అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది పిల్లల ప్రేమకు దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు చనిపోయే చివరి క్షణాన పిల్లల్ని చూడాలని, వారితో మాట్లాడాలని అనుకుంటారు.
* కొంతమంది వారికి నచ్చిన వ్యక్తులను ,వారి పేర్లను పదే, పదే గుర్తుతెచ్చుకుంటారు.
* ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అప్పటి వరకు వారి జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుని, వారు చేసిన తప్పులకు పశ్చాతాపంతో కుమిలిపోతూ.. జీవితంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారికి క్షమాపణలు చెప్పుకుంటారు.
* ఇంకొంత మంది మాత్రం తమ జీవితంలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని. పిల్లలు, స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలను తలచుకొని సంతోషంగా కన్ను మూస్తారు.
* కొంతమంది తమ ఇష్ట దైవాన్ని వారి మనసుల్లో తలుచుకొని వారికి స్వర్గాన్ని ప్రాప్తించమని కోరుకొని తుది శ్వాస విడుస్తారు.