Signs You Might Be Genuius : తెలివితేటలు అందరి సొత్తు. కానీ ఐక్యూ లెవెల్ నీ బట్టి అవి కొందరిలో ఎక్కువగాను, కొందరిలో తక్కువగాను ఉంటాయి. అయితే ఎవరికివారు తమ తెలివిని ప్రదర్శించుకోవాలి అనుకుంటారు. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎదుటివారు మన తెలివిని పొగిడినప్పుడు మనం సాధారణంగా సంతోషపడతాము. చాలామంది తమని తాము తెలివైన వాళ్ళుగా నిరూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే అందరి ముందు తెలివైనవాళ్లుగా ఉండాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి.. ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివైన వారిగా గుర్తిస్తారు.. ఇప్పుడు తెలుసుకుందాం.. తెలివితేటలు ఉన్నవారిలో మొదటి లక్షణం వీరిలో ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్లు దేన్నైనా చాలా క్లియర్ గా ఓపెన్ మైండ్ సెట్ తో ఆలోచిస్తారు. ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది.
కొన్ని విషయాలను క్రియేటివిటీగా కొత్తదనంతో ఆలోచించడంలో వీళ్ళు మొదటి వరుసలో ఉంటారు. ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీళ్లు వేరే వాళ్ళ మీద అసలు ఆధారపడరు. తమ పని తాము సొంతగా చేసుకోవడానికి ఇష్టపడతారు. వీళ్లు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు. అలాగే ఎటువంటి సందర్భంలోనైనా సెల్ఫ్ కంట్రోల్ తో ఉంటారు. వీళ్ళు తక్కువగా మాట్లాడి ఎదుటివారు చెప్పేది ఎక్కువ ఆసక్తితో వింటారు.
ఎక్కువ శాతం లెఫ్ట్ హ్యాండ్ పీపుల్ ని తెలివైన వారిగా పరిగణిస్తారు. ఐక్యూ లెవెల్ ఎక్కువగా ఉన్నవారిలో సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా గడుపుతారు. వీళ్ళు పగలు కంటే కూడా రాత్రిళ్ళు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంటారు.
.