Silver : మనలో చాలామంది నగలు ధరించడానికి ఇష్టపడతారు. కొంతమంది బంగారం ఎక్కువగా ధరిస్తుంటారు. మరి కొంతమంది వెండి వస్తువులు ధరిస్తారు. బంగారం తర్వాత వెండికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొంతమంది జాతకం ప్రకారము వెండి వస్తువులను ధరిస్తూ ఉంటారు. దాంట్లో వెండి ఉంగరాన్ని కూడా ధరిస్తారు.
అయితే ఈ వెండి ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఆ పరమశివుడి కన్నుల నుండి వెండి ఖనిజం ఆవిర్భవించిందని చెబుతారు. అలాంటి వెండిని ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. వెండి ఎక్కడైతే ఉంటుందో ఆ చోట కీర్తి ప్రజ్వరిల్లుతుంది. తొమ్మిది గ్రహాలలో చంద్రుడు ,శుక్రుడుతో వెండికి సంబంధం ఉంది.
వెండి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. గురువారం రోజున రాత్రి మొత్తం నీటిలో వెండి ఉంగరాన్ని ఉంచి, తెల్లవారి ఆ ఉంగరాన్ని విష్ణు పాదాల వద్ద పెట్టి పూజించిన తర్వాత, చందనం పూసి అక్షింతలు వేసి దీపం వెలిగించాలి. అనంతరం ఆ ఉంగరాన్ని కుడిచేతి చిటికెన వెలుకు ధరించాలి.
ఈ వెండి ఉంగరం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే.. శుక్రుడు, చంద్రుడు ప్రభావం వెండి ఉంగరం ధరించడం వల్ల మనిషిపై ఉంటుంది. ముఖంలోని మచ్చలు తొలగిపోయి,అందం పెరుగుతుంది. కోపం నియంత్రణలో ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెండి ఉంగరాలను చేతికి మాత్రమే కాకుండా మెడలో కూడా ధరించవచ్చు.
గొలుసు లాగా తయారు చేపించి మెడలో వేసుకోవచ్చు. దానివల్ల వాత,కఫలను సమతుల్యం చేస్తుంది. కీళ్ల నొప్పులు ఎముకలకు సంబంధించిన సమస్యలు, కఫం, రుమటిజం వంటి ఎన్నో సమస్యలు వెండి ధరించడం వల్ల నివారించబడతాయి.