Why Should Women Wear a Blob : నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి.? అసలు సైన్స్ ఏం చెప్తుంది..? బొట్టు ఆడవాళ్లేనా మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చా..? అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం..హిందూ ధర్మం అంటేనే సైన్స్ అన్న విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ కల్చర్ లోను లేని ఆచారం మనకు ఉంది. అది నుదుటను బొట్టు పెట్టుకోవడం. ఈ బొట్టు పెట్టుకోవడం అంటే మనం హిందువు అని గర్వం గా చాటడమే..
మన ధర్మంలో నుదుటన బొట్టు పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. దీనివల్ల అందమే కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ విషయం సైన్స్ కూడా చెబుతుంది. మన శరీరంలో మొత్తం ఏడు చక్రాలు ఉంటాయి. అందులో ఆరో చక్రమే ఆజ్ఞా చక్రం దీన్నే మూడో కన్నుగా పిలుస్తారు. శరీరంలో కల్లా ప్రధాన నాడీ కేంద్రమైన ఈ బిందువు శక్తిని ఏకాగ్రతని పెంచడంతోపాటు దుష్టశక్తుల్ని కూడా దూరంగా ఉంచుతుంది.
రెండు కనుబొమ్మల మధ్య మనం బొట్టు పెట్టుకునే ఈ ఆజ్ఞా చక్ర ప్రదేశం మానవ శరీరం లో ఆరవ అత్యంత శక్తివంతమైన చక్రంగా పరిగణిస్తారు. ఈ ప్రదేశాన్ని రోజులో ఎక్కువ సార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం కోసం నుదుటి మధ్య భాగాన్ని నొక్కడం వల్ల ఇది తల..కళ్ళు.. మెదడు.. పీనియల్ గ్రంధిని, పిట్యూటరీ గ్రంధి ని ప్రేరేపితం చేస్తుంది. రోజుకు చాలా సార్లు బొట్టు ప్రదేశంలో ప్రెస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుగలుగుతాం..
ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉల్లాసంగా ఉంటుంది. తలనొప్పి కూడా తగ్గిపోతుంది. సైనస్ సమస్యలు కూడా తీరిపోతాయి. దృష్టి.. ఆరోగ్యం మెరుగుపడతాయి అలానే మనం కూడా అందంగా.. యవ్వనంగా కనిపిస్తాము. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా నుదుటను బొట్టు పెట్టుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల మహిళలే కాదు మగవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ప్రతి హిందువూ నుదుటన బొట్టు ధరించండి..