Morning Motivation:మేల్కొలుపు-17
నీతో ఉన్న వారు..
అసలు నిన్ను ఎందుకు కలిసామా…అనేలా బ్రతకకూడదు..
నిన్ను విమర్శించిన వారు కూడా.
నిన్ను ఎందుకు వదులుకున్నామా..అనేలా బ్రతకాలి.
నిన్ను వద్దునుకొన్న బంధాల ముందు జాలిగా నిలబడకు..
నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు.
నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు..
యుద్ధం మొదలయింది.
నా వెనుక ఎంతమంది ఉన్నారని కర్ణుడు చూసాడు…
నా ముందు ఎవరున్నారని అర్జునుడు చూసాడు.
బలాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు..
భగవంతుడిని నమ్ముకున్నోడు గెలిచాడు..
ఇక్కడ తెలియాల్సింది ఒకటుంది.
భగవంతుడెప్పుడూ ప్రత్యేకంగా బలాన్నివ్వడు…
నీ బలాన్ని నీకు గుర్తుచేస్తాడంతే…
మనం ఎవరిని చూసి సిగ్గు పడద్దు..
అయినా చూసి సిగ్గు పడే అంత క్యారెక్టర్స్ ఎవరికీ లేవిక్కడ.
ఒకరితో గొడవపడే అంత చెడ్డవారిమి మనం కాదు…
మన జోలికి వస్తే మాత్రం..వదిలే అంత మంచి వారిమి కూడా కాదు..
ఒక పర్వతాన్ని అధిరోహించిన తర్వాతే….
ఇంకా ఎక్కాల్సిన కొండలు ఎన్నో ఉన్నాయని తెలుస్తుంది..
లోపాలున్నాయని అభిమానించే మనుషుల్ని దూరం చేసుకోకండి..
మనం సామాన్య మనుషులం
ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది..
ఏ మనిషి సంపూర్ణంగా ఉండరు..
ఎంతో అందంగా ఉన్నాడు అనుకునే చంద్రుడిలో కూడా లోపం ఉంది…
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది..
దానిని చూసే మనసుండాలి….
అభినందించే గుణం ఉండాలి.
శుభోదయం