Morning Motivation:మేల్కొలుపు-18
ప్రతి వ్యక్తి కూడా ఒక విలక్షణమైన వ్యక్తే..
నీకు వీలైతే ఆ విలక్షణాన్ని గుర్తించే ప్రయత్నం చేయ్..
అంతేగానీ…
అతనిలోని ఆ విలక్షణాన్ని అవహేళన చేయకు.
అతని పట్ల చిన్నచూపు చూడకు..
అమ్మ చేతి దెబ్బకు…
పరాయి వారి దెబ్బకు తేడా ఉంటుంది.
నీ మేలు కోరి చేసే విమర్శకు..
నీ విలువను తగ్గించే విమర్శకు మధ్య తేడాలా…
వ్యక్తిగత విభేదాలు లేకుండా..
ఒక వ్యక్తి మీద నీకు మితిమీరిన కోపం ఉందంటే….
అది ఆ వ్యక్తి దోషం కాదు..
నీ అహం లో ఉన్న లోపం అది.
ఒకటి మాత్రం నిజం
నువ్వు ఆ కోపం దగ్గరే ఆగిపోతావు…
వారు నీ కోపాన్ని ఇంకా ఇంకా పెంచే స్థాయికి చేరుకుంటారు..
కాలం మారుతుందో లేదో తెలియదు కానీ..
మనుషులు మాత్రం కచ్చితంగా మారుతున్నారు.
ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా…
లేనప్పుడు మరోలా ఉంటున్నారు
ఎవరిని నమ్మాల్లో తెలియడం లేదు..
మంచి తనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో..
అలాగే
మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం.
జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు .
ఎందుకంటే…
ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు…
జీవితంలో ముందడుగువేయలేరు .
మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
మనసు ఆరోగ్యంగా ఉండాలంటే…
గతాన్ని పాఠంగా స్వీకరించు.
భవిష్యత్తు ఎక్కువగా ఆలోచించు
వర్తమానాన్ని అమితంగా ప్రేమించు..
ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా తలవక పోయినా…
మీరు మాత్రం తలుచుకోండి.
ఎందుకంటే….
బంధం చాలా అందమైనది అందులో పోటి ఉండకూడదు.
ప్రేమ అప్యాయతలు మాత్రమే ఉండాలి.
శుభోదయం