Morning Motivation:మేల్కొలుపు-19
స్నేహమంటే..నటించి వెళ్లిపోవడానికి సినిమా కాదు..
లాభం ఆశించటానికి…
వ్యాపారమూ కాదు…
ఊపిరి ఉన్నంత వరకు
ఏ కష్టం వచ్చినా
అండగా నిలిచేది నిజమైన స్నేహం.
అందుకే ఒక మంచి మిత్రుడు
వందసార్లు అలిగినా..
బతిమాలుకోవడంలో తప్పు లేదు.
దారం తెగి హారంలోని ముత్యం పడిపోతే
పోతేపోనీ అని వదిలేయక
దండలో తిరిగి కూర్చుతాం కదా…
ఇదీ అలాగే.
మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ.
ఏదైనా పని చేసేటప్పుడు ….ఏమీ ఆశించకుండా చేయండి… అది పూర్తయినప్పుడు ఎంతో సంతృప్తి నిస్తుంది.
నువ్వు గెలిచే వరకు నీకథ ఎవరికి అవసరం లేదు..
ఎవరూ వినిపించుకోరు కూడా..
నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా.. వినాలన్నా….నువ్వు గెలవాలి.
జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు..
కాలం వెనక్కి లాగుతుందని భయపడకు.
వెనక్కు లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్లగలదు.
నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక నీదవుతుంది.
గొప్ప పనులు బలంతో కాదు… పట్టుదలతో సాధ్యమవుతాయి…..
శుభోదయం