Morning Motivation:మేల్కొలుపు-20
కుటుంబం అనేది…
రక్త సంబందం మాత్రమే కాదు..
ఎవరి జీవితంలో….వారితో
నువ్వు కూడా ఉండాలని కోరుకుంటారో..
నిన్ను నిన్నుగా ఎవరైతే ఇష్టపడతారో…
నీ ముఖంలో నవ్వును చూడటానికి…
ఎవరైతే ఏదైనా చేయటానికి సిద్ధపడతారో..
ఏది… ఏమి…. జరిగినా..
నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో…
వాళ్ళే నీ కుటుంబం.
నీ ఆనందాన్ని..ఇతరుల ఆనందంలో వెదకాలి అంటే..
తోటివారు తృప్తిగా..సంతోషంగా ఉండడానికి..
నీ వంతు కృషి,
మనసా వాచా కర్మణా,
సహాయం చేస్తూ ఉండాలి.
ఇదే మానవ ధర్మం.
ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది.
లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని కదిలిస్తుంది…
జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి విజయానికి అవసరమైన ఎన్నో విషయాలు నేర్పుతుంది.
ఇటువంటి సందర్బాలలోనే మనుషుల తత్వాలు బోధపడతాయని అర్దమౌతుంది.
సమస్యలు, అవహేళనలు …. అవమానాలు జీవితంలో సర్వసాధారణమని గ్రహించాలి.
అప్పుడే జీవితాన్ని ఉన్నతంగా మలుచు కోవచ్చు.
సమున్నతంగాను తీర్చి దిద్దు కోవచ్చు……
ఆదర్శంగాను నిలుపు కోవచ్చు…
నీవు చేసిన ఒక తప్పు…..
నీకు లభించిన ఒక మంచి
సలహా కంటే భవిష్యత్తులో
బాగా ఉపయోగిస్తుంది……
శుభోదయం