Morning Motivation:మేల్కొలుపు-21
తరువాత పేజీలో ఏముందో తెలియని పుస్తకం…
మన జీవితం……
చూడటానికి…
మనుష్యులు అందరూ ఒకేరకంగా ఉంటారు..
కానీ…
ఆ మనిషి మనసు లోపలకు….. వెళ్ళి చూస్తే..
ఏ ఒక్క మనిషి ప్రవర్తన కూడా…
మరో మనిషిలా ఉండదు..
ఎంతో భిన్నత్వంగా ఉంటుంది.
చెయ్యి అందించి..
పైకి తీసుకుంటున్నారని
అందరి దగ్గర చేతిని ఇచ్చి వేయకండి.
ఎందుకంటే..
అందులో ఎన్నో చేతులు..
మీ పై పగ తీర్చుకోవడం కోసం మాత్రమే
ఎదురుచూస్తూ ఉండవచ్చు..
నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా..
నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూనే ఉంటుంది.
దానిని
భూతద్థంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ఇదే ఈ లోకం నైజం..
మనిషిని చెడు ఆకర్షించినoతగా మంచి ఆకర్షించలేదు .
ఎందుకంటే
చెడు సుఖాలతో మొదలై కష్టాలపాలు చేస్తుంది .
మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది .
మనం ఏదైనా సేవ చేసేటప్పుడు..
విసుగుతోను నిర్లక్ష్యంగాను అసహనంగాను ఉండకూడదు.
శాంతంగా ఓర్పుతో ఆరాధనా భావంతో సేవను చేయండి.
ఆ సేవకు వందశాతం ఫలితం ఉంటుంది….
ఎవరు…ఏ ఏ లొకేషన్ లో ఉన్నా, చివరికి అందరి లొకేషన్ “స్మశానమే”
జీవితం …నీవు ఆశించే వాటివి నీకు దొరకవు..
ఆశించని వాటివి మాత్రమే నీకు లభిస్తాయి..
దేనికైనా సమయం పడుతుంది.
బంధాలను బలహీనతలుగా భావిస్తే..
బాధ్యతలు బరువుగా అనిపిస్తాయి..
ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది…
ఎందుకంటే……
ఏ అనుభవం సులువుగా రాదు… అనుభవిస్తే తప్ప..
శుభోదయం