Morning Motivation:మేల్కొలుపు-22
అమావాస్య రోజు వెన్నెల ఇవ్వడని చంద్రుణ్ణి నిందించడం ఎంత తప్పో..
కోపంలో ఒక మాట అన్నారని నా అనుకునే మనుషుల్ని వదులు కోవడమూ అంతే తప్పు.
జీవితంలో మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే
గర్వంగా చెబుదాం..
నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా….
నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేసింది లేదని .
మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం…
మన వలన ఒకరు బాధ పడుతున్నారంటే అదే మన గుణం
మనం దేనికీ భయపడవద్దు.
మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది.
భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతీ కష్టాన్ని ఓర్పుతో భరించాలి.
సాక్షాత్తు భగవంతుడే స్వయంగా మానవునిగా పుట్టినా కూడా ఈ బాధలనుండి తప్పించుకోలేడు..
సమయం . పరిస్థితులు ఎప్పుడు మారుతూనే వుంటాయి
చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికి మారవు ..
నీకున్న మంచికాలం… లోకానికి నీవెంతో తెలియజేస్తుంది.
నీకొచ్చిన కష్టకాలం… లోకమంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది.
శుభోదయం