Mahesh Babu fans Fire on Trivikram : గత కొంతకాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మహేష్ తో త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ మొదలు పెట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం షూట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. దీనికి తోడు మెయిన్ కాస్టింగ్ తో పాటు అనేక మార్పులు చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ షూటింగ్ లో వేగం పెంచట్లేదు మేకర్స్.
పైగా పూజ హెగ్డే ప్లేస్ లో శ్రీలీలను, శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరీని తీసుకోవడంతో రీ షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ కంప్లీట్ అవ్వడానికి మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. దీంతో గుంటూరు కారం మూవీని త్రివిక్రమ్ లైట్ తీసుకున్నాడని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి తోడు ఆ మధ్య అల్లు అర్జున్, శ్రీలీలల ఆహా యాడ్ కి త్రివిక్రమ్ డైరెక్షన్ చేయడం, అది మరువక ముందే అల్లు అర్జున్ తో ఇంత హడవిడిగా
త్రివిక్రమ్ మూవీని అనౌన్సమెంట్ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒక స్టార్ హీరోతో మూవీ చేస్తూ.. అది సగం కూడా అవకుండానే ఇంకో స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీ ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు. గుంటూరు కారం మూవీని జనవరి 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఆలోపు గురూజీ ఏం చేసి మహేష్ అభిమానులను శాంతపరుస్తాడో చూడాలి.