Ruhani Sharma : కొంతమంది సినిమా హీరోయిన్స్ మొదట్లో చాలా ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించినప్పటికీ రెండు, మూడు సినిమాల తర్వాత మాత్రం గ్లామర్ షో తో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక అడవి శేష్ హిట్టు సినిమాలో కాస్త సింపుల్ గానే కనిపించిన రుహాని శర్మ కూడా ఇటీవల కాలంలో తన గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్ల మతిపోగొట్టేస్తోంది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన రుహానీ శర్మ 2017లో కడైసి బెంచ్ కార్టీ అనే తమిళ సినిమా సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాది చి.ల.సౌ. అనే తెలుగు చిత్రంలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది.
తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి తెలుగులో మరిన్ని అవకాశాలను చేజిక్కించుంకుంది. హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లా అందగాడు చిత్రాల్లో నటించి మెప్పించింది. కమల అనే సినిమాతో మలయాళ సినీ రంగంలో, ఆగ్రా అనే సినిమాతో బాలీవుడ్ లోనూ కాలు మోపింది. ఓ వైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా అటు తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
తనకు సంబంధించిన పర్సనల్ ట్రావెల్ ఫిక్స్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. టాలీవుడ్‌కి ‘చి.ల.సౌ’తో ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ .. తొలి చిత్రం తోనే సైమా అవార్డు సొంతం చేసుకుంది ఇటీవల ‘హర్: చాప్టర్ 1’లో ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో ఈమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. రుహానీ ప్రస్తుతం వెంకటేశ్ ‘సైంధవ్’లో డాక్టర్ రేణు పాత్రలో నటిస్తోంది. ఇది హిమాచల్ సుందరి రుహానీ కహానీ..